సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించు

మోపిదేవి: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము తెలిపారు. మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు ఎన్నో కష్ట, నష్టాలు కోర్చి మిర్చిని పండిస్తే కొనుగోలు లేక అప్పుల్లో రైతులు కూరుకుపోయారని అన్నారు. రైతుకు భరోసా కల్పించేందుకు వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన రెడ్డి మే నెల 1, 2వ తేదీల్లో చేపట్టే రైతు దీక్షకు పెద్ద ఎత్తున రైతులు, పార్టీ కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఆయన వెంట వైయస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు, బిసీ మండల కన్వీనర్‌ రాజులపాటి నాగేశ్వరావు, పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరావు, పఠాన్‌ కరీముల్లాఖాన్‌ ఉన్నారు.

Back to Top