గన్నవరం చేరిన విజయమ్మ

గన్నవరం:

తుపాను బాధిత ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. విజయమ్మకు స్వాగతం పలికిన వారిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, తాడి శకుంతల, తదితరులున్నారు.

Back to Top