వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా యాత్ర నాలుగో రోజు షెడ్యూల్‌


అనంత‌పురం) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర ఆత్మీయ‌పూర్వ‌కంగా సాగుతోంది. మూడు రోజుల పాటు తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో  సాగిన ప‌ర్య‌ట‌న విశేష ప్ర‌జాస్పంద‌న ను చూర‌కొంది. నాలుగో రోజు క‌దిరి నియోజ‌క వ‌ర్గం లో ప‌ర్య‌ట‌న నిర్వ‌హిస్తున్నారు. క‌దిరి నుంచి ప్రారంభ‌మై కుమ్మ‌ర వాండ్ల ప‌ల్లి, మ‌ర‌వ తండా,క‌మ‌తం ప‌ల్లి, ద్వార్నాల‌, క‌టారుప‌ల్లి క్రాస్‌, గాండ్ల పెంట‌, రెక్క‌మాన్‌, ధ‌నియాన్ చెరువు మీదుగా ప్ర‌యాణం సాగుతుంది. ఎన్ పీ కుంట లో సోలార్ రైతుల తో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడ‌తారు. 
Back to Top