<br/>ప్రజాసంకల్పయాత్ర బృందం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలోని గజపతినగరం పట్టణ శివారున శిబిరం వద్ద శనివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాడ్డి సన్యాసప్పలనాయుడును ఆరోగ్యం ఎలా ఉందంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి నుంచి తమకు ఎంతో అభిమానమని, మీ కుటుంబానికి ఎప్పుడూ అభిమానంగా ఉంటామని జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సన్యాసప్పలనాయుడు తెలిపారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు ఉన్నారు.<br/><br/>