వైయ‌స్ జ‌గ‌న్ తో దౌత్య‌వేత్త‌ల భేటీ

 హైదరాబాద్:  ప్ర‌తిపక్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో సురినామ్ దేశ దౌత్యవేత్తలు  కలుసుకున్నారు. సురినామ్ గౌరవ రాయబారి ఆసిఫ్ ఇక్బాల్, ఉప రాయబారి ఆండ్రూ స్, ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఫర్ పీస్ ఎంఏ నజీబ్ తదితరులు వైఎస్ జగన్‌తో అరగంట సేపు సమావేశమయ్యారు.

 జూలై 15న హైదరాబాద్‌లో తమ రాయబార కార్యాలయ ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్‌ను వారు ఆహ్వానించారు. ప్రొఫెసర్ జియా, హైదరాబాద్ రాజ కుటుంబానికి చెందిన రౌనఖ్‌యార్ ఖాన్, సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్‌లు వైఎస్ జగన్‌ను కలిసిన బృందంలో ఉన్నారు.
 
Back to Top