26 ఏళ్లయినా పర్మినెంట్‌ కాలేదన్నా...

వైయస్‌ జగన్‌కు వ్యవసాయ క్షేత్రం కార్మికుల మొర...
శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ కలిసి వ్యవసాయ క్షేత్రం ఫీల్డ్‌ వర్కర్స్‌ తమ సమస్యలు విన్నవించుకున్నారు. 26 ఏళ్లుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్‌ చేయాలని కార్మికులు కోరారు.టీడీపీ ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో దినసరి కూలీలకు టైం స్కేల్‌ వర్తింపజేసిన ఘనత వైయస్‌ఆర్‌దే అని అన్నారు.212 జీవో అడ్డుగా ఉందని సరళించామని కోరుతున్న ఇంతవరుకు పట్టించుకోలేదన్నారు. గత 26 సంవత్సరాలుగా కేవలం దినసరి కూలీలుగానే ఉన్నామని,కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందలు ఎదుర్కొంటున్నామన్నారు.ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించడంలేదని వాపోయారు.  వైయస్‌ జగన్‌ సీఎం అయితే పర్మినెంట్‌ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
Back to Top