బాబు పాలనలో బతకలేమన్నా..మా జీవితాలను నట్టేట ముంచాడు
వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్న రైతులు
గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నామని కన్నీరుపెట్టిన అన్నదాతలు
కర్షకులను ఓదార్చి అండగా ఉంటానని జననేత భరోసా
విజయనగరం: చంద్రబాబు వచ్చి మా జీవితాలను నట్టేట ముంచాడని పార్వతీపురం నియోజకవర్గ సీతానగరం మండలం అప్పయ్యపేట రైతులు, రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కరువుతో అల్లాడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సీతానగరంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పయ్యపేట రైతులు కలిశారు. వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. చిన్నా, మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోయాయని, ఎకరానికి మూడు బస్తాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. పంటకు సాగునీరు లేదు, ఎరువులకు విపరీతమైన ధరలు పెంచారని, పంటకు గిట్టుబాటు ధర మాత్రం కల్పించడం లేదన్నారు. దీంతో రైతు కుటుంబాలన్నీ రోడ్డునపడే పరిస్థితి దాపరించిందన్నారు. గత నాలుగేళ్ల నుంచి జంజావతి కాల్వ నుంచి నీరు ఇస్తామని చంద్రబాబు మోసం చేస్తున్నాడన్నారు. ఇవాల్టికీ నీరు ఇచ్చిన పాపానపోలేదన్నారు. 

ఎకరాకు సుమారు రూ. 30 వేల పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే దిగుబడి 15 క్వింటాల్‌ వస్తుందన్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లి ధాన్యాన్ని అమ్మితే రెండు నెలల తరువాత డబ్బులు ఇస్తున్నారని, రూ. 30 వేల పెట్టుబడికి రూ. 22 వేలు మాత్రమే వస్తున్నాయన్నారు. దీంతో అప్పులపాలవుతున్నామన్నారు. డీఏపీ బస్తా రూ. 15 వందలు, యూరియా బస్తా రూ. 350 వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట సాగుచేసి అప్పులపాలువుతన్నామని, ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవడం లేదన్నారు. ఉండటానికి ఇళ్లు లేక, తాగడానికి నీరు లేక, పంటలకు గిట్టుబాటు ధర లేక చంద్రబాబు వచ్చిన నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నామన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే బతుకులు బాగుపడతాయని, జగనన్నను సీఎం చేసుకుంటాం. మా బతుకులు మార్చుకుంటామని రైతులు ముక్త కఠంతో నినదంచారు.
Back to Top