<br/><br/>విజయవాడ: చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడం చాలా మందికి నచ్చడం లేదని, అందుకే త్వరలోనే ఆ పార్టీ నేతలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. విజయనగరంలో వైయస్ జగన్ సమయంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిన రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాను పార్టీలో చేరేందుకు కృషి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదన్నారు. ఇప్పుడు తల్లి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని దేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు వస్తారని పేర్కొన్నారు.