ఎన్నికలకు సిద్ధంకండి’

ఎడపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఎడపల్లిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌కు భయపడిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోయిందని ఆరోపించారు. ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూ చించారు. ఆదివారం బోధన్ పట్టణంలోని అప్నా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే నియోజ కవర్గ స్థాయి సమావేశానికి పార్టీ నాయకు లు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులకు పూర్తి స్థాయి లో సహకరించాలని, పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేందర్‌గుప్తా, అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ధర్మానపై కేసులు ఎత్తివేయాలి
- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల డిమాండ్
నరసన్నపేట: నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించటమేకాక ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై నిరసన పెల్లుబికింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు సంఘీభావం తెలి పేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సత్యవరం జంక్షన్ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా సుమారు 5 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ‘పోలీసులు డౌన్ డౌన్.. ఎమ్మెల్యే కృష్ణదాస్‌పై కేసులు ఎత్తివేయాలి.. ఎస్‌ఐ నారీమణి క్షమాపణ చెప్పాలి..’ అనే నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అరగంట సేపు ధర్నా చేసేందుకు అనుమతిచ్చిన నరసన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్.మూర్తి ఆ సమయం పూర్తి కాగానే ఆందోళనకారులను అరెస్ట్ చేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు యత్నిం చారు. ఇంతలో మరికొందరు కార్యకర్తలు, అభిమానులు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఇలాగైతే అందరినీ అరెస్టు చేస్తామని హెచ్చరించిన సీఐ, ఎమ్మెల్యే కృష్ణదాస్ కుమారుడు ధర్మాన రామలింగన్నాయుడితో సహా 30 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.  రాస్తారోకోలో పాల్గొన్న వైయస్‌ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్ని ధర్మాన కృష్ణదాస్‌పై లేనిపోని కేసు లు పెట్టారని ఆరోపించారు.  జాతీయ రహదారిపై బైఠాయింపు సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు-పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. సీఐ మూర్తి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సీపీ ఆందోళన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు ఎమ్మెల్యే కృష్ణదాస్‌కు ఫోన్‌లో వివరించారు. అనంతరం ఆందోళన విరమించారు.
ఫీజు రీయింబర్సుమెంటుపై దురాలోచన: రంగారావు
బొబ్బిలి: ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చెరిపేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ పార్టీ నాయకుడు, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్‌కే రంగారావు హెచ్చరించారు. దర్బార్ మహల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని పేద విద్యార్థులకు అందించాల్సింది పోయి వ్యాపార సంస్థలా ప్రభుత్వం ఆలోచన చేయడం దురదృష్టకరమన్నారు. విజయమ్మ ఏలూరులో దీక్ష చేస్తే దానిని కొందరు రాజకీయం చేశారన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ నాయకత్వం కోరుకుంటున్నారని చెప్పారు.  రాష్ర్టంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరమని ప్రజలంతా గుర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. గొర్లె సీతారాంపురం గ్రామానికి చెందిన 130 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరాయి. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడారు. వారంతా జగన్ నాయకత్వం కావాలని కోరుకుంటూ రోజు రోజుకు అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నారన్నారు.
వైయస్ పేరు తొలగింపు కుట్రే
నరసాపురం: నరసాపురం పురపాలక సంఘ భవనానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి పేరు తొలగింపు చర్య కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్రలో భాగమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మునిసిపల్ భవనానికి కోటిపల్లి పద్మసురేష్ పేరుపెట్టడంపై ధ్వజమెత్తారు. భవన నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మునిసిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేయించారని, ఆయన్ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. భవన ఆవరణలో వైఎస్ విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగానే పెట్టలేదని ఆరోపించారు.

Back to Top