ఎమ్మెల్యే బాలరాజుకు అపెండిసైటిస్ ఆపరేషన్

హైదరాబాద్, 16 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే, పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఆయనకు ఏషియన్ ఇనిస్టిట్యూట‌్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో అపెండిసైటిస్‌కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో వైద్యులు ‌ఈ ఆపరేషన్ నిర్వహించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలరాజును విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా‌, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు.

సోమవారం టి.నరసాపురంలో ‘రాజన్నబాట’ కార్యక్రమం నిర్వహించేందుకు వెళుతుండగా ఆయన అస్వస్థతకు గురయ్యూరు. వెంటనే వైద్య చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. వైద్యులు ‌ఆయనకు అపెండిసైటిస్‌ ఉన్నట్లు గుర్తించి, శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పలువురు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు బాలరాజును పరామర్శించారు.‌
Back to Top