ఒంగోలు: ఒంగోలు పోస్టాఫీస్‌కు గొప్ప చరిత్ర ఉందని, 1962లో దక్షిణభారతదేశంలో అత్యంత పెద్దడివిజన్‌గా ఉన్న ఒంగోలులో.... సుమారు 150 మంది సిబ్బందితో పోస్టాఫీస్‌ను ప్రారంభించారని వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన స్థానిక పోస్టాఫీస్‌లో మొక్కను నాటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పటి నుంచి పోస్టాఫీస్ భవనం పాక్షికంగా దెబ్బతిన్నా ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం దారుణమన్నారు. భవనం విషయమై తక్షణమే కేంద్ర టెలికాం మంత్రితో చర్చిస్తానన్నారు. సుమారు ఎకరా స్థలంలో పోస్టాఫీస్ నూతన భవానాన్ని మంజూరు చేస్తానన్నారు. మార్కాపురంను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.