ఈ నెల 29న 'వైయస్ఆర్' సీఎల్పీ భేటి

హైదరాబాద్, 28 నవంబర్ 2012:

వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేటరీ పార్టీ గురువారం నాడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సమావేశం కానుంది.  ఈ నెల 30న ప్రారంభమయ్యే శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, శాసనసభాపక్ష నేత వైయస్ విజయమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు సభలో ప్రస్తావించాల్సిన ఇతర ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.  శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 30, డిసెంబర్ ఒకటవ తేదీన జరగనున్నాయి.

Back to Top