హైదరాబాద్) ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని అనర్హుల్ని చేసి ఎన్నికలకు వెళ్లాలని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జున మాట్లాడుతూ, "ఫిరాయింపుదారుల్ని అనర్హుల్ని చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. తాజాగా ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడే అధికార పార్టీ అసలు రంగు బయట పడుతుంది. టీడీపీ మీద ప్రజల్లో ఉన్నవ్యతిరేకత తెలిసివస్తుంది." అని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఆయన చేతలకు పొంతన లేదని నాగార్జున విమర్శించారు. స్వయానా మామగారైన ఎన్టీఆర్ మీద చెప్పులేయించిన చరిత్ర చంద్రబాబుకే సొంతమని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. <br/>To read the same article in English: http://bit.ly/1qKzWdG <br/>