దర్యాప్తు దారి తప్పింది జోక్యం చేసుకోండి

కేం

ద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సీబీఐ.. తన భర్త శ్రీ వై.యస్. జగన్మోహన్‌ రెడ్డిని సార్వత్రిక ఎన్నికల వరకు జైల్లోనే ఉంచేందుకు కుట్ర చేస్తోందని శ్రీమతి వై.యస్. భారతి ఆవేదన వ్యక్తంచేశారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతుందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆమె లేఖ రాశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినందుకే ఆయనపై కుట్ర చేసి కేసులు పెట్టారంటూ.. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గుర్తుచేశారు.

శ్రీ జగన్మోహన్ రెడ్డిపై దర్యాప్తు పూర్తి చేయడానికి 2012 అక్టోబర్‌లో 3 నెలలు గడువు కోరిన సీబీఐ.. ఆ గడువు లోపల దర్యాప్తు పూర్తి చేయకపోగా.. 8 నెలల తర్వాత 2013 మేలో మరో 4 నెలల గడువు కోరిందని గుర్తుచేశారు. దీనికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికే సీబీఐ న్యాయవాది.. 4 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసే అవకాశాలు లేవని, తాము మరింత గడువు కోరతామన్నట్లు సంకేతాలిచ్చారని, అసలు దర్యాప్తు పూర్తి చేసే ఉద్దేశమే సీబీఐకి లేదని దీని ద్వారా స్పష్టమవుతోందని ఆమె ప్రధాని దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా పౌరుల హక్కుల కోసం నిలబడిన నేతగా దేశం గుర్తుంచుకునేలా చేయాలని, మూడు దశాబ్దాలుగా దేశానికి, పార్టీకి సేవచేసిన వైయస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నా మౌనంగా చూస్తుండిపోయిన నేతగా మిగిలిపోవద్దని శ్రీమతి భారతి కోరారు. అదే సమయంలో సీబీఐ న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని కోరుతూ ఆమె సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు లేఖ రాశారు.(సాక్షి సౌజన్యంతో)

Back to Top