హైదరాబాద్: కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుడు చెరుకులపాటి నారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.<img src="/filemanager/php/../files/statics/2.jpg" style="width:950px;height:600px;vertical-align:middle"/><br/><br/>2009లో జరిగిన ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు నారాయణరెడ్డితో పాటు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఒకరు, పలువురు డైరెక్టర్లు, 10 మంది సర్పంచులు, పలువురు ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.