అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శ

నక్కపల్లి: మండలంలోని దేవవరం శివారు చినరామభద్రపురంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలను పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొల్లబాబూరావు, సమన్వయకర్తల కమిటీ సభ్యుడు వీసం రామకృష్ణలు  గురువారం పరామర్శించారు.  గ్రామానికి వెళ్లి బాధిదితులు ఓదార్చారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి నాలుగురోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్దిక సహాయం అందకపోవడం శోచనీయమన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణం ప్రభుత్వం తరపున సహయం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ వేగేశ్న సూర్యనారాయణరాజు, మాజీఎంపిటీసి గొర్లనర్సింహమూర్తి, పార్టీనాయకులు కురందాసు నూకరాజు, డి తాతాబ్బాయి.   వేగేశ్నచంటి, పైలా నూకన్ననాయుడు, కోన సోములు, మునుకుర్తి శివాజీ,  సఖిరెడ్డి వెంకటరమణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top