చంద్రబాబు గాడ్సే కంటే హీనుడు

  • బాబు అవినీతిలో దూసుకెళ్తున్నారు
  • పుష్కరాల ఆహ్వానంపై ఉన్న శ్రద్ధ హోదాపై లేదు
  • ధనవంతుడిగా బాబు బినామీ, క్రిమినల్ కేసుల్లో మరో ఇద్దరు
  • ఏడీఆర్ రిపోర్ట్ లో వెలుగుచూసిన వాస్తవాలు
  • వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి

హైదరాబాద్ః చంద్రబాబుకు పుష్కరాల ఆహ్వానాలపై ఉన్న శ్రద్ధ ప్రత్యేకహోదాపై లేకపోవడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు బినామీగా మంత్రి నారాయణ అమరావతిలో భూకుంభకోణాలకు తెరలేపి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మారితే, మహిళలను వేధించిన కారణంగా క్రిమినల్ కేసుల్లో ఉన్న మంత్రుల్లో దేశంలోనే నలుగురుండగా, అందులో ఇద్దరు  బాబు ఇష్టసఖులైన దేవినేని ఉమ, అచ్చెన్నాయుడులు ఉన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై ఏడీఆర్ సంస్థ రిపోర్ట్ లోని విషయాలను ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.

ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే...

()నేను అధికారంలోకి వస్తే ఆడవాళ్ల కళ్లల్లో వెలుగులు నింపుతా. వారికి ఏ సమస్య రాకుండా మహిళా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తా. డ్వాక్రా అక్కాచెల్లెల్లకు రుణాలన్నీ మాఫీ చేస్తా. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తా.  విద్యార్థులకు సైకిళ్లు కొనిస్తా. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తానని మాట్లాడావే. ఈ హామీలన్నీ ఏమైయిపోయాయి బాబు.  
()మహిళా శాసనసభ్యురాలిని శాసనసభ నుంచి గెంటివేయించి దుశ్సాసనులతో సభను నింపిన చరిత్రగా బాబు పాలన మిగిలిపోతుంది. ఓ మంత్రి కొడుకు తప్పతాగి విద్యార్థుల హాస్టల్ మీద దాడి చేస్తే దిక్కు లేదు. మరో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నతాధికారి పట్ల దారుణంగా, అవమానవీయంగా ప్రవర్తిస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయమే సర్దుకుపొమ్మని ఆదేశించిన ఘటన. ఇదేనా బాబు మహిళల పట్ల నీవిస్తున్న గౌరవం. 
()మొన్నటికి మొన్న ప్రత్యేకహోదా కోసం తిరుపతిలో నిర్వహించిన బంద్ లో మహిళల చీరలు చించి,  పుస్తెలు తెెంచి,  రవికలు లాగి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో సభ్యసమాజం చూసింది. 
()దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా ఏపీ మంత్రి నారాయణ కాగా....మహిళల మీద అఘాయిత్యపు కేసులు నమోదు కాబడినవాళ్లలో  నలుగురిలో ఇద్దరు మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడులున్నారు. 
()ప్రభుత్వ చేయూత ద్వారా నడుస్తున్న 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల ఎన్సీఏఆర్ సంస్థ అత్యంత అవినీతి ప్రభుత్వం బాబు ప్రభుత్వమని తేల్చింది. దానికి ఇంతవరకు అధికారపార్టీ నుంచి సమాధానమే లేదు. 
() భూదందాలో, మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించడంలో, అవినీతిలో బాబు దూసుకెళ్తున్నారు. 
()అమరావతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం అక్కడ భూదందా చేస్తోందని మా నాయకుడు ముందు నుంచీ చెబుతున్నారు. పేదవాళ్ల భూములను దోపిడీ చేసిన బాబు ముఠాపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని తాము డిమాండ్ కూడా చేశాం. 
()నాకు మరో అజెండా లేదు. తాను ఢిల్లీకి వెళ్లేది ప్రత్యేకహోదా కోసం కాదు.  పుష్కరాలకు ఆహ్వానించేందుకే ఢిల్లీకి వచ్చానని  బాబు పత్రికా సమావేశంలో చెప్పడం హేయనీయం. 
()వారం క్రితం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి హోదా ఇచ్చేది లేదని తేల్చితే....బాబు రాత్రిపూట ప్రెస్ మీట్ పెట్టి ఇంత అన్యాయమా, అక్రమమా. నా రక్తం మరిగిపోతుంది అని మాట్లాడితే ....నిజంగానే బాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడేమో, కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకుంటాడేమోనని ఐదుకోట్ల ప్రజలు ఆశ్యర్యకితులయ్యారు. బాబు హోదాను సాధిస్తాడనుకున్నారు. 
()కానీ, బాబు ఢిల్లీ వెళ్లి మరిగిపోయిన రక్తాన్ని మురుగుగా మార్చాడు. ప్రధానికి, మంత్రులకు పట్టు శాలువాలు  కప్పి వినయంగా నమస్కారం పడేసి పుష్కరాలకు ఆహ్వానించేందుకు వచ్చానని చెబుతూ... ఢిల్లీ నడి వీధుల్లో తెలుగుదేశం పార్టీ నైజాన్ని, తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని నిర్వీర్యం చేశారు. 
() ప్రత్యేకహోదా కోసం నిరసన తెలపడం గానీ, దాని అవసరాన్ని గానీ చెప్పకుండా ...నేను అందుకు వెళ్లలేదని బాబు చెప్పారంటే ఆయన  చిత్తశుద్ధి ఏపాటిదో తెలిసిపోయింది. 
()హోదాపై ప్రైవేటుమెంబర్ బిల్లును డిప్యూటీ చైర్మన్ కురియన్ లోక్ సభ స్పీకర్ కు పంపిస్తుంటే ...టీడీపీకి చెందిన మంత్రి సుజనా చౌదరి బల్లచర్చి బీజేపీ సభ్యులతో కలిసి ఆనందంలో మునిగిపోయాడు. తెలుగువాళ్లకు ఏం సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అన్ని పార్టీలు ప్రైవేటు మెంబర్ బిల్లు ద్రవ్యబిల్లు కాదని చెబుతుంటే ....మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడుతాం. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని సీఎం రమేష్ చెప్పడం హోదాను నీరుగార్చడం కాదా. 
()పుష్కరాల స్నానాల కోసం ఆహ్వాన పత్రికలు తీసుకెళ్లేంత శ్రద్ధ హోదా విషయంలో ప్రదర్శించలేకపోయారు. 
()  భారతీయ పోరాటాలకే వెన్నుముఖగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమానికి మరో మూడు రోజుల్లో 75 ఏళ్లు నిండనున్నాయి. అలాంటి  క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన భూమిక పోషించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని బురదకాల్వలో పడేశారు. మహాత్మను అవమానించినందుకు విచారణ వ్యక్తం చేయడం గానీ, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం గానీ టీడీపీ చేయకపోవడం బాధాకరం. 
()గాడ్సే కంటే కూడా హీనుడు నా అల్లుడు అని ఎన్టీఆర్ ఆనాడే బాబు గురించి చెప్పారు. మహాత్ముని విగ్రహాన్ని తొలగించడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. 
()ఇప్పటికే విజయవాడలో 40 గుళ్లను, మసీదులను కూల్చేసిన ఘన చరిత్ర గల ప్రభుత్వం టీడీపీది.  భగవంతుడిని కూడా నిరంకుశంగా పక్కకు కూలదోయగల ఘనడు బాబు. 
() ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ప్రత్యేకహోదాను మరుగునపర్చి చంద్రబాబు పిరికిపందగా వ్యవహరించిన తీరు ఐదుకోట్ల మందిని అవమానించడమేనని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 
Back to Top