చంద్రబాబు@420

ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మోసపూరిత పాలన సాగిస్తున్న చంద్రబాబుపై  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో వైయస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను దగా చేసిన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

పులివెందులలో చర్చకు సిద్ధమా
వైయస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి
చంద్రబాబు హామీలపై వైయస్ జగన్ తో చర్చించే స్థాయి టీడీపీ నేత సతీష్ రెడ్డికి లేదని వైయస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. దమ్ముంటే తనతో పులివెందులలో చర్చకు సిద్ధం కావాలని అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చచడంలో ఘోరంగా విఫలం అయ్యారని విమర్శించారు. బాబు మోసాలపై వైయస్సార్సీపీ నేతలు పులివెందులలో ర్యాలీ తీసి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీలో వైయస్ వివేకానందరెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, ఇతర నేతలు  పాల్గొన్నారు. 

బాబును ప్రజలే తరిమికొడతారు
ప.గో. జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు నిలదీసే రోజులు ప్రారంభమయ్యాయని పశ్చిమగోదావరి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు.  గోపాలపురం పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబును ప్రజలే తరిమికొడతారన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. పట్టిసీమ పేరుతో పశ్చిమగోదావరి జిల్లాను నిలువునా మోసం చేశారని చంద్రబాబుపై ఆళ్ల నాని నిప్పులు చెరిగారు.

బాబు సీఎం కావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం
విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వంచించిన చంద్రబాబుపై విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో వంగవీటి రాధా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క హామీని కూడా చేయకపోగా అన్ని చేసినట్లుగా గొప్పులు చెప్పుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నారు.

 అధికారంలోకి రాగానే 5 సంతకాలు చేశారు. అవి వేటిపై చేశారో నీకు గుర్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చి వాగ్ధానాల్లో ఒక్కటైనా పూర్తి చేశారా..? దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా..? అని సవాలు విసిరారు. ప్రజలకు ఎలాంటి లబ్ది చేకూర్చకపోగా తెలుగుదేశం పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అడ్డంగా దోచిపెడుతున్నారని మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో రోడ్డుకు అడ్డంగా కార్యక్రమాలు చేయడం తప్ప ఆ దీక్షలో ఏమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి పెరిగిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు, డ్వాక్రామహిళలకు కంప్లీట్‌గా రుణమాఫీ చేస్తానని చెప్పి వారిని నట్టేట ముంచారని ఫైరయ్యారు. పాలనలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి మోసాలకు పాల్పడుతున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని ఫిర్యాదులో నమోదు చేసినట్లు చెప్పారు. 

ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు
వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌
విశాఖపట్నం: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రెండు సంవత్సరాల్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేక పోయినా చేయని పనిని కూడా చేసినట్లుగా చెప్పుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు విశాఖ పోలీస్‌ స్టేషన్‌లో చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి కానీ... చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినన్ని హామీలు ఏ జాతీయ పార్టీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో 600ల వాగ్ధానాలు ఇచ్చి వాటిల్లో 5, 6 కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఎంతో కష్టపడి రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేశానని, సత్యనాదెళ్ల తనవల్లే ఆ స్థాయికి ఎదిగాడని చెప్పే దౌర్భాగ్యస్థితికి దిగజారారన్నారు. 
Back to Top