చంద్రబాబు రైతులను చిన్నచూపు చూస్తున్నారు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ మండిపడ్డారు. కరువుపై చంద్రబాబుకు అవగాహన లేదని, అందుకే 2013 ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వనని చెబుతున్నారని విమర్శించారు.

పారిశ్రామికవేత్తలకు ఓ న్యాయం, రైతులకు మరో న్యాయమా అని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ తప్పుపట్టారు. చంద్రబాబుకు రాయలసీమపై నిజంగా ప్రేమ ఉంటే హంద్రీ నీవాకు 1500 కోట్ల రూపాయల నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తామని చంద్రబాబు, మంత్రులు పొంతనలేని హామీలు ఇస్తున్నారని అన్నారు. అక్రమ సంపాదన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు ముందుకుతెచ్చారని ఆరోపించారు. ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నించారు. రుణమాఫీ హామీ అమలుగాక రైతులు, డ్వాక్రా మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా ప్రజలు టీడీపీకి 2 ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించినా చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సూచనలతోనే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top