ఏపీకి మీ శాపం ఏమిటి బాబు..?

 • చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బాబు ఆర్భాటం
 • నవనిర్మాణదీక్ష కాదు నయవంచన, విధ్వంస దీక్ష
 • ఆ జీవోలపై రాజద్రోహం కేసు పెట్టాలి
 • రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బాబు విధ్వంసం చేశారు
 • చేయని వాటిని చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు
 • ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
 • బాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడుః పద్మ
 • హైదరాబాద్ః  చంద్రబాబు తన పాపాలు, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే... నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అది నవనిర్మాణ దీక్ష కాదని నయవంచక, విధ్వంస దీక్ష అని పద్మ నిప్పులు చెరిగారు. రెండేళ్లలో ఏమీ చేయడం చేతగానీ ముఖ్యమంత్రి ....విభజన సమయంలో జరిగిన గాయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ  ప్రజలను రెచ్చగొడుతున్నారని  వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బాబు చేపట్టిన దీక్ష ఓ దివాలాకోరు దీక్ష అని తూర్పారబట్టారు.  బాబు విడుదల చేసిన జీవోలు 11, 66లపై  రాజద్రోహం కేసు పెట్టాలన్నారు.

  నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని చెబుతూ...ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకూడదన్న ఇంగితజ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యకరమన్నారు. మనం దేశపౌరులుగా నివసిస్తున్నాం తప్ప రాష్ట్ర పౌరులుగా కాదని పద్మ అన్నారు. దీన్ని తయారుచేసిన అధికారులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శిక్షణ తీసుకున్నారేమో అంటూ ఎద్దేవా చేశారు. పాలన గుడ్డిగా  సాగుతుందనడానికి  ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే ఇందుకు నిదర్శనమని పద్మ చెప్పారు.  బాబు ఏపీని ప్రత్యేకదేశంగా భావిస్తూ, కాబోయే ప్రధాని అనుకుంటూ సింగపూర్ ,జపాన్ ల చుట్టూ తిరగడం సిగ్గుచేటని పద్మ ధ్వజమెత్తారు. 

  చంద్రబాబు రాష్ట్రాన్నిరెండేళ్లలో అన్ని రకాలుగా విధ్వంసం చేశారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కారణంగా అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని... బాబు, బీజేపీతో జతగట్టి మరింతగా దగా చేశారని విరుచుకుపడ్డారు. రైతుల భూములను దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇసుకను అక్రమ వ్యాపారంగా మార్చారు.  మహిళలకు భద్రత లేని పాలన తీసుకొచ్చారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బాబు మాట్లాడడం విడ్డూరమన్నారు. ఎవరి వల్ల అన్యాయం జరిగింది చంద్రబాబు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖల మీద లేఖలు రాసింది నీవు కాదా... ? విభజనకు పార్లమెంట్ లో తొలి ఓటు వేసింది మేమే అంటూ మీ ఎంపీలు మాట్లాడలేదా..?  విభజనకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ఏర్పడిన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందన్నారు. 

  మాట్లాడితే  వైయస్ జగన్ ను వేలెత్తి చూపించడం బాబుకు రివాజుగా మారిందని పద్మ ఫైరయ్యారు. మైకు ముందు సుద్దులు చెబితే తన తప్పులు ఎవరూ గుర్తించరనుకోవడం బాబు అవివేకమన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ తో మిలాఖత్ అయి చేసిన కుట్రల వల్ల వైయస్ జగన్ ను అన్యాయంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారన్నారు.  బెయిల్ కూడా రాకుండా అడ్డుకురన్నారు.  బెయిల్ వచ్చినదాన్ని కూడా ఓ కుట్రగా మాట్లాడే నీచ స్థాయికి దిగజారారని పద్మ మండిపడ్డారు.  

  విభజన తర్వాత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతామని మాట్లాడిన టీడీపీ, బీజేపీలు...రెండేళ్ల తర్వాత మాట్లాడుతున్న పచ్చి అబద్దాలు చూస్తే ఏపీకి ఈశాపమేందని ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు.  2019 వరకు తానుండగా  రాష్ట్రం బాగుపడదని దీక్ష ద్వారా బాబు చెప్పకనే చెబుతున్నారని పద్మ విరుచుకుపడ్డారు.  ఆ దీక్షలో కూడా జై జన్మభూమి అంటూ నినాదాలు చేసుకుంటున్నారు. మేం పరిశుద్ధులం తప్పంతా ప్రతిపక్షాలదేనని మాట్లాడుతున్నారు. అందరిచేత  ప్రతిజ్ఞ చేయిస్తున్న నీవు...ఏపీ కోసం  పలానా  మంచి చేశానని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలవా బాబు అంటూ పద్మ నిప్పులు చెరిగారు. 

  ఓటుకు కోట్లు కోసం ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి, తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టారని పద్మ ధ్వజమెత్తారు. కృష్ణా,గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుంటే బాబు ఒక్క మాట కూడా అడిగే ధైర్యం చేయడం లేదు. వేలకు వేల కోట్ల రూపాయల స్కాములు చేస్తూ కేంద్రం వద్ద తేలు కుట్టిన దొంగల్లాగా ఉన్నారు. ఓటు కోట్లు కేసులో ఇరుక్కోవడం వల్లే చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉన్నపలంగా విజయవాడకు తట్టాబేడా సర్దాడని పద్మ ఫైరయ్యారు. బాబు నీచ రాజకీయలకు ఏపీ ప్రజలు బలైపోతున్నారని పద్మ వాపోయారు. 

  ఆనాడు బాబు రాష్ట్రాన్ని విడగొట్టమంటే...సమైక్యంగా ఉంచాలని ప్రజలు పోరాడారు. ఇవాళ విభజన హామీల కోసం పోరాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ బాబే తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడుస్తున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
  హోదా కోసం కట్టుబడి ఉందామని బాబు నోట మాట కూడా రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకుండా... చేయనివన్నీ చేసినట్లుగా చెప్పుకుంటూ బాబు ప్రచార ఆర్భాటం చేస్తున్నారని పద్మ మండిపడ్డారు. 

  ప్రజలు ప్రతిజ్ఞ చేయాలి, ఉద్యమాలు చేయాలి. మీరు మాత్రం స్టార్ హోటళ్లలో కూర్చొని రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా బాబు అంటూ పద్మ నిప్పులు చెరిగారు. కేంద్రంతో అధికారాన్ని పంచుకుంటారు. హామీల సంగతి మాత్రం అడగరు. దీక్ష బాగా జరుగుతుందని ప్రచారం చేసుకోవడం, దానికో కోటి రూపాయలు ఖర్చు చేయడమే బాబు ఆరాటం తప్ప మరొకటి లేదని పద్మ దుయ్యబట్టారు.  సీఎం క్యాంపు కార్యాలయాలు, అద్దె భవనాలు,  ప్రత్యేక విమానాల పేరుతో వేలకోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శించారు. బాబు తాను చేసిందేమీ లేదు గనుకనే.. దీక్షలో ప్రతిపక్ష పార్టీపై గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

  ఎన్టీఆర్ ను, ఆయన ఆశయాలను చంపేసిన చంద్రబాబు .....ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను గ్లోబెల్స్ భవన్ అని మార్చుకోవాలని హితవు పలికారు. బాబు తన ప్రచార ఆర్భాటాలు చెప్పుకోవడానికి ...ప్రజలను నడిరోడ్డున ఎండలో నిలబెట్టి గంటసేపు మాట్లాడిన తీరు దౌర్బాగ్యమన్నారు. అసలు చంద్రబాబుతోనే ప్రజలకు పెద్ద కష్టం వచ్చిందని పద్మ అన్నారు. వ్యవసాయం నాశనమైంది. కరవుతో ప్రజలు వలసలు పోతున్నారు. ఇవేమీ పట్టకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను జోకొడుతున్నారు. మిగిలి ఉన్న మూడేళ్లలో ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి అబద్ధాలు చెప్పడం మాని...ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల గురించి ఆలోచన చేయాలని సూచించారు. లేకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతావని బాబును హెచ్చరించారు. 

  For English version- http://goo.gl/7PCrLR
Back to Top