చంద్రబాబుకు విద్యార్థుల ఝలక్‌..

యువనేస్తం ప్రారంభ సభలో ప్రశ్నల వర్షం కురిపించిన విద్యార్థులు
అమరావతిః యువనేస్తం ప్రారంభ సభలో చంద్రబాబుకు విద్యార్థులు ఝలక్‌ ఇచ్చారు. విద్యార్థులకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు ఖంగుతిన్నారు. ఎన్నికల కోసమే యువనేస్తం పథకాన్ని పెట్టారా..ఎన్నికలు ముగిశాక పథకాన్ని మూసేస్తారా అని  అడిగిన విద్యార్థుల ప్రశ్నలకు చంద్రబాబు ముఖం తెల్లబోయింది. శ్రీసిటీలో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారా అని ప్రశ్నించారు. మీరు కూడా ప్రభుత్వ యూనివర్శిటీలోనే చదువుకుని సీఎం అయ్యారు కాదా.. ప్రభుత్వ యూనివర్శిటీలను ఎందుకు ప్రోత్సహించడం లేదు. ప్రైవేటు యూనివర్శిటీలను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ వర్సిటీలు మూతపడే అవకాశముందని విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు .ప్రత్యేకహోదా ముఖ్యమా..ప్యాకేజీ ముఖ్యమా అని విద్యార్థులు ప్రశ్నించారు.. హోదా, ప్యాకేజీలపై చంద్రబాబు పాతపాటే పాడారు.. ఉర్దూ స్కూల్స్‌కు పీఈటీ నియమించాలన్న కడప జిల్లా విద్యార్థి అడగగా డబ్బుల్లేవని సమాధానం చంద్రబాబు సమాధానమిచ్చారు.
 
Back to Top