<strong>చండ్రుగొండ (ఖమ్మం జిల్లా) :</strong> చండ్రుగొండ ప్రధాన సెంటర్‌లో జాతీయ రహదారి పక్కన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పీక కృష్ణ శుక్రవారంనాడు విగ్రహాన్ని స్థూపంపై ప్రతిష్ఠించారు. జాతీయ రహదారికి సుమారు 30 అడుగుల దూరంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జంగా శ్రీనివాసరెడ్డి తన ఇంటి ఎదురుగా మహానేత విగ్రహం ఏర్పాటు చేశారు.