చేనేత కార్మికులతో షర్మిల మాటామంతీ

మంగళగిరి (గుంటూరు జిల్లా), 24 మార్చి 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నూరవ రోజున శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక చేనేత కార్మికుల ఇళ్ళకు వెళ్లి వారి కుటుంబాలతో కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత మగ్గాల పనితీరును ఆమె పరిశీలించారు. జగనన్న నేతృత్వంలో రాజన్నరాజ్యం త్వరలోనే వస్తుందని వారికి శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని వారికి శ్రీమతి షర్మిల అభయం ఇచ్చారు.
Back to Top