రాజీనామాలను విమర్శించే హక్కు బొత్సకు లేదు

హైదరాబాద్ 26 జూలై 2013:

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
రాష్ట్రంలోని రెండు ప్రాంతాల తెలంగాణ అంశంపై తన అభిప్రాయాన్ని ప్రకటించకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలను విమర్శించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఖరిని ఆయన ఖండించారు. రాజీనామాలు వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు.
తన వైఖరి చెప్పకుండా మిగిలిన పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకోవడం కాంగ్రెస్ పార్టీకి తగదన్నారు. ఇంతవరకూ ఆ పార్టీ తన వైఖరిని ఇంతవరకూ ఎందుకు వెల్లడించలేదని గట్టు ప్రశ్నించారు. సీడబ్ల్యూసీలో చర్చించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోతుందా? చెప్పాలని నిలదీశారు. ఇన్నేళ్ళ జాప్యం తర్వాత కూడా తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో కాంగ్రెస్ ఆలస్యం చేస్తుండడాన్ని గట్టు తప్పుబట్టారు.

తాజా వీడియోలు

Back to Top