వైయస్సార్సీపీలోకి బీజేపీ నేత

  • వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన జగన్ మోహన్ రాజు
  • బ్రహ్మణ ప్రముఖులు, పలు యూనియన్ ల నాయకులు
  • వైయస్ జగన్ ను సీఎం చేసేందుకు కృషి చేస్తాంః రాజు
హైదరాబాద్ః  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులై వివిధ పార్టీలు, సంఘాల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా బీజేపీ నేత ఏలేశ్వరపు జగన్‌ మోహన్‌ రాజు పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్‌ మోహన్‌ రాజు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. జగన్‌ మోహన్‌ రాజుతో పాటు ముఖ్య నాయకులు, అనుచరులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా బ్రహ్మాణ నాయకులంతా  వైయస్ జగన్ ను సత్కరించి,  వేదమంత్రాల చదివి ఆశీర్వదించారు.  

అనంతరం జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి బ్రాహ్మణసంఘాలు, పరుశురాం సేన, ట్యాక్సీ వర్కర్స్ యూనియన్, ఆటో రిక్షా యూనియన్ అనేక సంఘాలు వచ్చి వైయస్ఆర్ ఆశయ సాధన కోసం స్థాపించబడిన  వైయస్ జగన్ పార్టీ వైయస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. వైయస్ జగన్ కు తోడ్పాటుగా ఉండి ఆయన్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.  13 జిల్లాల బ్రాహ్మణ ప్రముఖులు త్వరలో జగన్ సమక్షంలో పార్టీలో చేరుతారని ప్రకటించారు. రాబోయే రోజుల్లో బ్రహ్మణ ప్రముఖులంతా వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

Back to Top