భీమవరంలో 'జగన్‌ కోసం.. జనం సంతకం'

భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై కుట్రలకు నిరసనగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భీమవరంలో మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉధృతంగా జరిగింది. పట్టణంలోని ప్రకాశం చౌక్‌లో‌ పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆధ్వర్యంలో‌ నిర్వహించిన సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిది.

ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగీ పార్టీ నాయకుడు గ్రం‌ధి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఓదార్పు యూత్రలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి అడుగడుగునా లభించిన ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోయిందని, ‌టిడిపితో కుమ్మక్కై, సిబిఐని వాడుకుని జననేత శ్రీ జగన్‌ను కుట్ర చేసి అరెస్టు చేయించిందని శ్రీనివాస్ ఆరోపించారు. ‌సిబిఐ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తూ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులోనే ఉంచాలని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

పార్టీ నాయకుడు మేడిది జాన్సన్, మునిసిపల్ మాజీ ఛైర్మ‌న్ గ్రంధి వెంకటేశ్వరరావు, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు వేగేశ్న రామకృష్ణంరాజు, రేవూరి గోగురాజు, చికిలే మంగతాయారు, పార్టీ మండల కన్వీన‌ర్ పెనుమాల నర్సింహస్వామి, నాయకులు పల్లా ఏసుబాబు, దాసరి రామచంద్రరావు, ముదునూరి సుబ్బరాజు, కొప్పర్తి వీరరాఘవులు, దాట్ల వీరభద్రరాజు (జైపాల్ రాజు), గుంటి ప్రభు తదితరులు పాల్గొన్నారు.‌
Back to Top