భగ్నమైన జలయజ్ఞం: విజయమ్మ

హైదరాబాద్, 12 జూన్ 2013:

హరితాంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వేగంగా సాగిన జలయజ్ఞం పనులపై ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉదాసీనవైఖరి అవలంబిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లెజిస్లేచర్ కమిటీ నేత శ్రీమతి వైయస్ విజయమ్మ మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె  ఆవేదన వ్యక్తంచేశారు. ప్రారంభమైన అరగంటకే అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన అనంతరం శ్రీమతి విజయమ్మ శాసన సభ ఆవరణలోని  మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. రాజశేఖరరెడ్డిగారు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పేదలు, రైతుల విషయమై ఒక స్పష్టమైన ప్రణాళికను నిర్దేశించుకున్నారని చెప్పారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞం కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని పేర్కొన్నారు. 86 ప్రాజెక్టులలో 28 పూర్తయ్యాయనీ, ఇవి కాక మొత్తం 75 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయనీ తెలిపారు. మరికొన్ని 90 శాతం వరకూ కూడా పూర్తయినవి ఉన్నాయన్నారు. మహానేత మరణానంతం జలయజ్ఞమే మూలన పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుందన్నారు. 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత సోనియా గాంధీని కలిసినప్పుడు రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టులకు జాతీయ హోదా అవసరమనే విషయాన్ని తెలిపారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులకు మహానేత అన్ని అనుమతులూ తెచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

మహానేత హయాంలోనే ప్రాణహిత-చేవెళ్ల  ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయహోదా సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. దివంగత మహానేత తన హయాంలో జలయజ్ఞానికి రూ.50వేల కోట్లు కేటాయించిన విషయాన్ని ఆమె విజయమ్మ ఈ సందర్భంగా జ్ఞాపకం చేశారు.

తాజా వీడియోలు

Back to Top