సాయం అడిగితే కేసులు పెడతారా..?


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్‌షో..
వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అప్పలాచారి ధ్వజం


శ్రీకాకుళంః సాయం అడిగితే యువకులపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని  పలాస వైయస్‌ఆర్‌సీపీ నేత అప్పలాచారి మండిపడ్డారు.  తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రకటించిన జీడి,మామిడి పరిహారం కూడా సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పర్యటనలో బాధితులను నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్నారు. తిండి,తాగునీరు వంటి కనీస సాయం కూడా అందక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. బాధితుల ఇబ్బందులను గుర్తించి సమస్యలు పరిష్కరించాల్సిన చంద్రబాబు సాయం అడిగి ప్రశ్నించినవారిపై కేసులు పెట్టించి అరాచకానికి పాల్పడటం దారుణమన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న  చంద్రబాబు చర్యలను ఖండిస్తున్నామన్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్డు షో చేస్తున్నారు.. తప్ప ప్రజల సమస్యలను తీర్చలేదన్నారు. విపత్తు వచ్చి ప్రజలు కష్టాలు పడుతుంటే సాయం అందిండం ప్రభుత్వం బాధ్యత అని అంతేకాని ఫోటోలకు ఫోజులిచ్చి ప్రచార్భాటం చేసుకోవడం కాదన్నారు. ప్రభుత్వం సాయాన్ని పార్టీ కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీపై స్పష్టత ఇవ్వండి అని ప్రశ్నించినందుకు యువకులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించడం సరికాదన్నారు.
Back to Top