చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు-జోగి రమేష్

విజయవాడ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు
మానసిక పరిస్థితే సరిగ్గా లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే
జోగి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి సరిగ్గా లేనే
లేదని నిర్ధారణ కూడా అయిందని ఆయన గుర్తు చేశారు. అటువంటి వారసత్వం పెట్టుకొని
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను విమర్శించటం సరిగ్గా లేదని ఆయన అన్నారు. విజయవాడ
వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రమాణస్వీకారం రోజు చేసిన అయిదు
సంతకాల్ని కూడా గాలికి వదిలేశారని, అమలు చేయలేదని జోగి రమేష్ గుర్తు చేశారు.
విజయవాడ వేదికగా తెలుగుదేశం రాజకీయ వ్యభిచారం చేస్తోందని చెప్పారు. నీటిపారుదల శాఖ
మంత్రి దేవినేని ఉమ క్రిష్ణా డెల్టాకే నీరు ఇవ్వలేదని, అటువంటప్పుడు రాయలసీమకు
నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వాగ్దానాల మీద బహిరంగ చర్చకు రావాలని టీడీపీ
నేతలకు ఆయన సవాల్ విసిరారు. 

Back to Top