ముడుపులపై ఉన్న ప్రేమ..రాష్ట్ర ప్రయోజనాలపై లేదు..

కాకినాడః రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలు ప్రజలు ఉపయోగపడటంలేదని, టీడీపీ నేతలు, కార్యకర్తలు దోచుకోవడానికే పనికివస్తున్నాయని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్రం విభజన చట్టంలో అంశాలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నమ్మించి ఓట్లు  వేయించుకుని  ఏపీకి హామీలు సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోకుండా ప్రత్యేకహోదా వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రాయితీలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్డీయే  ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టింది వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే అని అన్నారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో ముడుపులపై ఉన్న ప్రేమ..రాష్ట్ర ప్రయోజనాలపై లేదన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా తప్పకుండా సాధించుకుంటామని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top