జైలుకు పోతావని భయమా బాబు

హైదరాబాద్ః  రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రం చెబుతుంటే... బీజేపీని విమర్శించొద్దంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకోకుండా...మళ్లీ ఢిల్లీ వెళ్లి పోరాడుతామంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. బాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అంబటి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. 


చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టాడని అంబటి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోతానన్న భయంతోనే చంద్రబాబు నోట మోడీ, కేసీఆర్ ల మాట రావడం లేదని ఎద్దేవా చేశారు. భయాన్ని వీడి ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమతో కలిసి రావాలని అంబటి బాబుకు సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్సీపీకి ముఖ్యమని... మీరు పోరాటం చేస్తారా...పోరాటం చేస్తున్న తమతో కలిసివస్తారో తేల్చుకోవాలన్నారు.
Back to Top