బాబును మించిన అవినీతిపరుడు లేడు: నల్లపురెడ్డి

నెల్లూరు:

రాష్ట్రంలో చంద్రబాబంతా అవినీతి పరుడు వేరొకరు లేరని నెల్లూరు జిల్లా కోవూరు శాసన సభ్యుడు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు ప్రజాస్పందన లేదన్నారు. రైతులకు సక్రమంగా విద్యుత్తు అందలేని వ్యక్తి, ఇప్పుడు ఉచిత కరెంటు ఇస్తానని హామీ ఇస్తుండటం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయవచ్చన్నారు. సీఎం కుర్చీ కోసం ఆయన పడరాని పాట్లు పడుతున్నారని మండిపడ్డారు.  చంద్రబాబుకు దమ్మంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top