అనంత’లో వైఎస్సార్‌సీపీ అభిమానికి కత్తిపోట్లు

 అనంతపురం) వైఎస్సార్‌సీపీ ‘ప్రజాస్వామ్య
పరిరక్షణ సభ’లో అరాచకం సృష్టించేందుకు టీడీపీ నాయకులు కుట్రపన్నారు. శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ
అభిమానులపై దాడికి తెగబడ్డారు. ముందస్తు ప్రణాళికతో మునిసిపల్ కార్పొరేషన్
కార్యాలయంలో కాపు కాచి దాడికి తెగించారు. అనంతపురం రూరల్  మండలంకట్టకిందపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని
చంద్రమోహన్‌రెడ్డిపై కత్తితో దాడి  చేశారు.
బాధితుడికి పొట్ట భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
చంద్రమోహన్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఐదుకుట్లు పడ్డాయని బాధితుడి బంధువులు
తెలిపారు.

 టీడీపీ నేతలు, కార్యకర్తలు అనంతపురం నగరంలో భయోత్పాతం సృష్టించారు. అధికార
పార్టీ నాయకుల అరాచకాన్ని నిలదీసేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై
పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్లు చావబాదారు. టీడీపీ నాయకులు, పోలీసుల తీరుపై జిల్లావ్యాప్తంగా తీవ్ర విమర్శలు
వ్యక్తమవుతున్నాయి

Back to Top