వాడవాడలా రిలే నిరాహార దీక్షలు..!

వైఎస్ జగన్ కు మద్దతుగా దీక్షలు..!
గుంటూరు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ  నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు.  

అనంతపురం జిల్లా :
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం లో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద పార్టీ నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వజ్రకరూరు, కూడేరు మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిరాహారదీక్షకు దిగారు. మడకశిర, గుడిబండ, అగళి మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలకు దిగారు.తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. వైఎస్ జగన్ కు మద్దతు ప్రత్యేకహోదా కోరుతూ ఎస్కే యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

వైఎస్సార్ జిల్లా :
వైఎస్ జగన్ దీక్ష విజయవంతం కావాలని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామాలయంలో ప్రత్యేక పెన్నా సిమెంట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి  పూజలు చేశారు. రాజంపేటలో అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో, జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద పార్టీ నేత కె.బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు.

కర్నూలు జిల్లా :
కర్నూలు నగరంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో నిరాహారదీక్ష
చేపట్టారు. కల్లూరు మండలం మాధవీనగర్ లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రిలే నిరాహారదీక్ష చేపట్టారు. కర్నూలు నగరంలోని డీమాస్ సర్కిల్ లో వైఎస్ఆర్ సీపీ నేత సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక హోదా కోసం మండల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ సీపీ నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
చిత్తూరు జిల్లా :
తిరుపతిలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో దీక్షలు చేపట్టారు.ఎస్వీయూలో దీక్షకు దిగిన  విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝలుపించారు.  పోలీసుల దుశ్చర్యను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పుత్తూరులో మాజీ ఎంపీపీ ఏలుమలై ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాగింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా :
వేదాయపాలెం సెంటర్ లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తల మానవహారం నిర్వహించారు. ఎంపీలు మేకపాటి, వరప్రసాదరావు, జెడ్పీ ఛైర్మన్
రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవయ్య, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. పొదలకూరులో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల రిలే దీక్షలు ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా :
పరుచూరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. గిద్దలూరులో జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా:
పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలో కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ తోట గోపి ఆధ్వర్యంలో అదేవిధంగా జంగారెడ్డి గూడెంలో వైఎస్సార్సీపీ నేతలు  రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

తూర్పు గోదావరి జిల్లా :
జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నేతృత్వంలో రాజమండ్రి కోటగుమ్మం వద్ద కార్యకర్తల రిలే దీక్షలు. ముమ్మిడివరంలో పార్టీ నేత గుత్తుల సాయి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షలు.
రంపచోడవరంలో నేత బాలకృష్ణ ఆధ్వర్యంలో,. రావులపాలెంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో , పి.గన్నవరంలో వైఎస్ఆర్ సీపీ నేత కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో, అమలాపురంలో వైఎస్ఆర్ సీపీ నేతలు విశ్వరూప్, కుడిపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో ,పిఠాపురంలో పిండెం దొరబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు.

విశాఖపట్నం జిల్లా :
మునగపాకలో వైఎస్ఆర్ సీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు.

విజయనగరం జిల్లా :
బొబ్బిలిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు.

శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.


Back to Top