అందరికీ అంబేద్కర్‌ ఆదర్శం: శోభా నాగిరెడ్డి

ఆళ్ళగడ్డ (కర్నూలు జిల్లా), 14 ఏప్రిల్‌ 2013: భారతరత్న బాబాసాహెబ్ అంబేద్క‌ర్ వంటి మహనీయుడిని ‌అందరం ఆదర్శంగా తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ జయంతి‌ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆయన విగ్రహానికి శోభా నాగిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త‌ అంబేద్కర్ అని కొనియాడారు.

దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలువు ఆనం :
ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి చూపించాలని శోభా నాగిరెడ్డి సవాల్ విసిరారు.‌ శ్రీ వైయస్ జగ‌న్ను విమర్శిస్తున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.


Back to Top