మత్స్యకారుల ఇళ్ల తొలగింపుపై ఆగ్రహం

గుంటూరు:
కృష్ణా కరకట్ట ఒడ్డున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కరకట్ట వద్ద
ఉన్నమత్య్సకారుల ఇళ్లను తొలగించేందుకు అధికారులు అక్కడకు రాగా,
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. దీంతో అక్కడ
ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్రమ నిర్మాణంలో బస చేసే సీఎం కు పేదల
ఇళ్లను తొలగించే హక్కు లేదని ఆళ్ల మండిపడ్డారు. 

చంద్రబాబు
రెస్ట్ హౌజ్ నిర్మాణం అక్రమమో, సక్రమమో ప్రజలకు చెప్పాలని ఆళ్ల డిమాండ్
చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా మత్య్సకారుల ఇళ్లు ఎలా తొలగిస్తారని
ప్రశ్నించారు. 50 ఏళ్లుగా నివాసముంటున్న వారి ఇళ్లను తొలగించడం సరికాదని
ప్రభుత్వానికి హితవు పలికారు. 
Back to Top