దోచుకునేందుకే బాబు ప్రతిజ్ఞలు

ఏలూరు :  పశ్చిమగోదావరి జిల్లా వైయఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని చంద్రబాబుపై మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  చంద్రబాబువి నవ నిర్మాణ దీక్షలు కాదని, నయ వంచన దీక్షలు అని  ఎద్దేవా చేశారు. రానున్న మూడేళ్లలోనూ దోచుకుంటామని   ప్రతిజ్ఞ చేస్తున్న దీక్షలు అంటు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

 పట్టిసీమ పేరుతో  గోదావరి జలాలను  మంత్రి దేవినేని ఉమ  పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. అధ్యక్షులు  వైయస్ జగన్ జూన్ 15వ తేదీన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటిస్తారని ఆళ్లనాని చెప్పారు. ఈ సమావేశంలో తలశిల రఘురాం, బాలరాజు, ఘంటా మురళీతోపాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top