జగన్‌ దీక్షకు లోటస్‌పాండ్‌లో ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, 5 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవద్దు, సమైక్యంగానే ఉంచాలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఆమరణ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ జగన్‌ నివాసం లోటల్‌పాండ్‌లో శనివారం 10.30కు ఆయన నిరాహార దీక్ష చేపడారు. దీక్షా వేదికతో పాటు, దీక్షకు మద్దతుగా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలకు అసౌకర్యం కలగని విధంగా పార్టీ నాయకులు ఏర్పాట్లన్నీ చేశారు. ప్రాణం కాదు ప్రజలు ముఖ్యం అంటూ శ్రీ జగన్‌ ఈ దీక్ష చేస్తున్నారు.

'ఎజెండాలు పక్కన పెట్టి ఎవరి జెండాలు వారు పట్టుకొని సమైక్య రాష్ట్రమే ఎజెండాగా  అందరూ ముందుకు రాల్సిన సందర్భం ఇది. రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా కదలాల్సిన చారిత్రక సందర్భమిది' అంటూ శ్రీ జగన్ ఇచ్చిన ఈ పిలుపుతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మహోధృతంగా కొనసాగుతోంది.

Back to Top