ఓటుకు కోట్లు కేసు పునర్విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశాలు

హైదరాబాద్ః ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయ కూడా... చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ఈకేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు జరిగింది. ఓటుకు కోట్లు కేసు విచారణ సరిగా జరగలేదని, పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్కే తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. 

మన వాళ్లు బ్రీఫుడ్ మీ అని బాబు మాట్లాడిన మాటలు వాస్తవమేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిపోర్ట్ ఇచ్చిందని, ఆ నివేదికను..అదేవిధంగా బాబు నుంచి ప్రాణహాని ఉందని జెరూసలెం మత్తయ్య  మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామన్నారు. విచారణ లేటయినా న్యాయమే గెలిచిందని, న్యాయవ్యవస్థపై తమకు అపార నమ్మకముందని ఆర్కే, సుధాకర్ రెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top