ఆప్యాయత 'ఆయన' చిరునామా!

కడప : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కోశాధికారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు అని పార్టీ కడప జిల్లా కన్వీనర్ కె.సురే‌ష్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆప్యాయంగా పలుకరించి, తక్షణమే పనిచేసి పెట్టేవారని గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కిర‌ణ్‌కుమార్‌రెడ్డి 'ఆరోగ్యశ్రీ' పథకం అమలు తీరును పర్యవేక్షించేవారని తెలిపారు. కడప జిల్లా ప్రజల పట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ప్రేమ కనబరిచేవారని సురేష్‌బాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించారు.

తాజా ఫోటోలు

Back to Top