90వ రోజు పాదయాత్ర ప్రారంభం

గుంటూరు, 14 మార్చి 2013 :

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారానికి 90వ రోజుకు చేరింది. గుంటూరు జిల్లా పేరెచర్ల నుంచి ఉదయం ఆమె యాత్ర  ప్రారంభించారు. నల్లపాడు శ్రీనివాస కాలనీ, నల్లపాడు వెంగళాయపాలెం క్రాస్ రోడ్డు మీదుగా నల్లపాడు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు. ఇవాళ 10.9 కిలో మీటర్ల మేర శ్రీమతి షర్మిల నడుస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

Back to Top