33 రోజుల్లో షర్మిల పాదయాత్ర 434 కి.మీలు

కర్నూలు, 19 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర సోమవారం‌ నాటి షెడ్యూల్ ముగిసింది. సోమవారంనాడు ఆమె 15.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాత్రికి పెంచికలపాడు వద్ద షర్మిల బస చేస్తారు.

కర్నూలు జిల్లా జూలకల్ శివారు నుంచి సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన షర్మిల జూలకల్, పొన్నకల్, గూడూరు, గుడిపాడు మీదుగా పెంచికలపాడు వరకు నడిచారు. గూడూరులో మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. షర్మిల పాదయాత్ర సోమవారంనాడు గూడూరు మండలంలోకి ప్రవేశించించింది. సాయంత్రం గుడిపాడు మండల కేంద్రంలో ఆమె రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

కాగా, షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంనాటికి 33 రోజులు పూర్తయింది. సోమవారం యాత్ర ముగిసే సమయానికి మొత్తం 434.1 కిలోమీటర్ల మేరకు ఆమె నడక సాగించారు.
Back to Top