33వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

జూలకల్ 19 నవంబర్ 2012 : కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం జూలకల్ నుండి సోమవారం ఉదయం షర్మిల 33వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది వెంట నడువగా షర్మిల 'మరో ప్రజాప్రస్థానం'  పొన్నకల్, గూడూరు, గుడిపాడు వైపు సాగుతోంది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజన్న ఆశయాలను నెరవేరుస్తాడని షర్మిల గ్రామస్థులతో అన్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ, ప్రజల బాగోగులు వాకబు చేస్తూ షర్మిల సాగిపోతు న్నారు. పాదయాత్రలో వైయస్ఆర్ సీపీ నేతలు ఎం.వి. మైసూరారెడ్డి, శోభా నాగిరెడ్డి, ఎస్వీ. మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.

Back to Top