అనంతలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్య

అనంతపురం జిల్లా: రాయలసీమలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా హతమార్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో సోమవారం ఈ హత్యలు జరిగాయి. ఎద్దుల దూలం లాగుడు పోటీలు జరుగుతుండగా వివిధ గ్రామాలకు చెందిన వారు అక్కడ చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీకి చెందిన రామసుబ్బారెడ్డి, లాలెప్పలను గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో హతమార్చి పరారయ్యారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. పాత కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతులిద్దరూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. 
Back to Top