164వ రోజుకు చేరుకున్న షర్మిల యాత్ర

ఆచంట, 30 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్  షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాటికి 164వ రోజుకు చేరకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర చేయనున్నారు. గురువారం ఉదయం ఆమె జగన్నాథపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. మార్టేరు, ఆలమూరు, కట్టవపాడు, కంతేరు మీదుగా కొట్టపాడు వరకు సాగుతుంది. రాత్రికి కొట్టపాడులో శ్రీమతి షర్మిల బసచేస్తారు. ఇవాళ మొత్తం 14.2 కిలోమీటర్ల మేర ఆమె నడుస్తారు.

తాజా ఫోటోలు

Back to Top