వైయస్‌ఆర్‌ సీపీలో 200ల మంది టీడీపీ నేతలు చేరిక

ఉదయగిరి: చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారన్నారు. ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం సంగసానిపల్లిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 200ల మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సుబ్బారెడ్డి, రమణయ్య, అల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు. 
Back to Top