డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలి

విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఫిర్యాదు

విశాఖపట్నం:  డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్లకు  వైయ‌స్ఆర్‌సీపీనేతలు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి, వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ..డబుల్‌ ఎంట్రీ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ఓటు వేసినవారితో కూడా ఏపీలో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top