కుమారుడికి పగ్గాలు ఇస్తారంట 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి :  టీడీపీ పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని చంద్ర‌బాబు అనుకుంటున్నారా? అని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు. బాబు వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును కాబోయే సీఎం'గా  ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట... అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇంకెన్నో..
చంద్ర‌ బాబు నాయుడు... ప్రధానిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ ఏపీలోకి రావటానికి వీల్లేదన్న నోటితోనే కేంద్ర ప్రభుత్వ విచారణ కావాలంటున్నారు. ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి..!' అంటూ మ‌రో ట్వీట్‌లో  విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top