లోకం నవ్వుతుంది పప్పు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
 

తాడేప‌ల్లి : వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నాయుకుడు నారా లోకేష్‌ బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్పీజీ విషయంలో లోకేష్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆదివారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘  లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?.. నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?.. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?.. ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’’ అంటూ ఎద్దేవా చేశారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top