వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు అకాల మ‌ర‌ణం  

 అనంతపురం:  హుల్లేకెర గ్రామానికి చెందిన మాజీ సర్పంచు దేవన్న తనయుడు, వైయ‌స్ఆర్‌సీపీ  యువనాయకుడు డీ శ్రీనివాస్‌ (38) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. బెంగళూరులో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఆదివారం ఉన్నఫళంగా కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే శిర ప్రభుత్వసుపత్రికి తీసుకెళ్లారు.అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పార్టీలో చురుకుగా పనిచేసేవాడని స్థానిక ప్రజాప్రతినిధులు అన్నారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top